Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 6:46 pm Posted by : ramakrishna

నమస్తే తెలంగాణ కార్యాలయంపై దాడి హేయమైన చర్య

  • బిఆర్ఎస్ నాయకులు కంచర్ల రవి గౌడ్

 

సిరిసిల్ల, బతుకమ్మ : హనుమకొండలో జరిగిన నమస్తే తెలంగాణ కార్యాలయంపై  కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రజా పాలనను అర్థం చేసుకోలేక మీడియాపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆయన అన్నారు. “ఇది ఇందిరమ్మ రాజ్యమా, ప్రజా పాలన అంటే దాడులేనా?” అని రవి గౌడ్ ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తున్న నమస్తే తెలంగాణ పత్రికపై దాడి చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.దీనిపై కఠిన చర్యలు తీసుకుని, దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మట్టి శ్రీనివాస్, ఎస్.కె. అప్రోచ్ శ్రీనివాసరావు, హరీష్,అరికెళ్ళి వినయ్ కుమార్,సంపత్,సాయి, నరేష్,రాము తదితరులు పాల్గొన్నారు.