Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2024, 6:21 pm Posted by : ramakrishna

మేయర్ భర్త దండు చంద్రశేఖర్ పై దాడి

. . . రాడ్ తో దాడి చేసిన ఆటో డ్రైవర్

. . . ప్లాట్ వివాదంలోనే దాడి జరిగినట్లు సమాచారం

నిజామాబాద్, బతుకమ్మ                                                                                                                                                           

నిజామాబాద్ నగరంలో మేయర్ దండు నీతూ కిరణ్ భర్త బీఆర్ఎస్ నాయకులు దండు చంద్రశేఖర్ పై దాడి  జరిగింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం నాగారం 80 క్వార్టర్స్ లో చోటు చేసుకుంది. నగరంలోని 10వ డివిజన్ లో ఓ వాటర్ ప్లాంట్ వద్ద 80 క్వార్టర్స్ కు చెందిన ఆటో  డ్రైవర్ షేక్  రసూల్ ఆలియాస్ శక్రూ అనే యువకుడు శేఖర్ పై దాడి చేశాడు. అంతకు ముందు సంబంధిత దాడి వీడియోను తీసేందుకు వ్యక్తిని ముందుగానే సిద్దం  చేసుకుని దాడి చేయడం దారుణం. శేఖర్ పై ముందుగా చేతితో దాడి చేసి ఆటోలో ఉన్న రాడ్ తీసుకువచ్చి తలపై బాదాడు. ఈ ఘటనలో శేఖర్ కు తీవ్ర రక్తస్రావం జరిగింది. అతన్ని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బీఆర్ ఎస్  నాయకుడు దండు శేఖర్ పై జరిగిన దాడి గురించి నిజామాబాద్ నార్త్ సిఐ కు వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. మేయర్ భర్త శేఖర్ పై జరిగిన దాడి వీడియో సోషల్ మీడియాలో గిరికిలు కొడుతుంది. స్థానికంగా వంద గజాల ప్లాట్ వివాదంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది.

Attack on Mayor's husband Dandu Chandrasekhar