Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2024, 12:14 pm Posted by : ramakrishna

అడ్వొకేట్ ఖాసీంపై దాడి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరానికి చెందిన అడ్వొకేట్ ఖాసీంపై ఆయన కార్యాలయంలోనే ఇద్దరు దాడి చేశారు. ఖాసీం ఆఫీస్ పక్కన ఉన్న  స్థలం కొనుగోలు తరువాత వివాదం చెలరేగింది.  పక్కింటి వారు పాత గోడను కూలగొట్టి కొత్త గోడ కట్టేందుకు ఖాసీంను సంప్రదించగా ఆయన ముందు అంగీకరించినా ఆ తరువాత దాటవేస్తూ వచ్చాడు. ఈ విషయంలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న వాగ్వాదం దాడికి దారి తీయగా, ఆయనపై పలువురు దాడి చేశారు. లాయర్లు సోమవారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రెండో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.