ఏబీబీపీ కన్వీనర్ ఆదిత్యపై దాడి పిరికిపంద చర్య
నిజామాబాద్, బతుకమ్మ : సిద్దిపేట జిల్లా ఏబీబీపీ కన్వీనర్ ఆదిత్యపై హుస్నాబాద్ లో కత్తులతో గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈఘటన ఓ పిరికి పంద చర్య, దేశ భక్తిపై, విద్యార్థి ఉద్యమం పై దాడి అని నిజామాబాద్ జిల్లా ఏబీవీపీ శాఖ అభివర్ణించింది. అలాగే ఆదిత్యపై దాడిని ఖండించింది. ఆపరేషన్ కగర్ కు మద్దతుగా కార్యక్రమం చేసినందుకు ఈదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆదిత్యపై దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి పోలీసులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఏబీవీపీ శాఖ డిమాండ్ చేసింది.