అటవీ సిబ్బందిపై కలప స్మగ్లర్ల దాడి

. కేశవపట్నంలో ఉద్రిక్తత . పోలీసుల కార్డన్ సెర్చ్ లో రూ.10 లక్షల కలప సీజ్ ఆదిలాబాద్, బతుకమ్మ: అక్రమంగా కలపను డంప్ చేశారనే సమాచారం అందడంతో తనిఖీలకు వెళ్లిన అటవీ శాఖాధికారులు, సిబ్బందిపై స్థానికుల సహయంతో స్మగ్లర్లు కర్రలతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా రెచ్చిపోయిన స్మగ్లర్లు స్థానికుల‌ సాయంతో అటవీశాఖ సిబ్బందిపై రాళ్ల దాడికి  పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీట్ ఆఫీసర్ జాదవ్ నౌశిలాల్ కు...