Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 April 2025, 5:08 pm Posted by : ramakrishna

ఇందల్వాయి ఎస్సై హెడ్ క్వార్టర్స్ కు అటాచ్

ఇందల్వాయి, బతుకమ్మ​ : ఇందల్యాయి ఎస్ఐని హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇందల్వాయి పోలీస్​స్టేషన్​లో ఎస్సైగా కొనసాగుతున్న ఎస్సై మనోజ్​ ఇటీవల ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. డయల్​ 100కు ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే పోలీసులు దౌర్జన్యం చేశారంటూ బాధితుడు ఆరోపించాడు. ఈ విషయమై సీపీ సాయిచైతన్య స్పందించి విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఇందల్వాయి ఎస్సై మనోజ్​ అత్యుత్సాహం ప్రదర్శించి దాడి చేసినట్లు స్పెషల్ బ్రాంచి సిబ్బంది నివేదిక ఇచ్చారు. సోషల్​ మీడియాలోనూ సంబంధిత ఎస్సై దాడి చేసిన వీడియోలు బయటకు రావడంతో ఉన్నతాధికారులు సైతం సీరియస్​గా తీసుకున్నారు. ఈ క్రమంలో ఎస్సై మనోజ్​ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ అటాచ్​ చేసినట్లు తెలిసింది. కొత్తవారిని నియమించే వరకు డిచ్​పల్లి ఎస్ఐ మల్లేశ్​ తాత్కాలికంగా బాధ్యతలు చూడనున్నారు.