ఇందల్వాయి ఎస్సై హెడ్ క్వార్టర్స్ కు అటాచ్

ఇందల్వాయి, బతుకమ్మ​ : ఇందల్యాయి ఎస్ఐని హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇందల్వాయి పోలీస్​స్టేషన్​లో ఎస్సైగా కొనసాగుతున్న ఎస్సై మనోజ్​ ఇటీవల ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. డయల్​ 100కు ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే పోలీసులు దౌర్జన్యం చేశారంటూ బాధితుడు ఆరోపించాడు. ఈ విషయమై సీపీ సాయిచైతన్య స్పందించి విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఇందల్వాయి ఎస్సై మనోజ్​ అత్యుత్సాహం ప్రదర్శించి దాడి చేసినట్లు స్పెషల్ బ్రాంచి...