అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలి

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వాటా మేరకు వెచ్చించాలి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య   నిజామాబాద్, బతుకమ్మ : ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని సమావేశ మందిరంలో శనివారం ఆయన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యల ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ...