నిజామాబాద్, బతుకమ్మ: నకిలీ గల్ఫ్ ఏజెంట్ పై నందిపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నందిపేట మండలం అయిలాపూర్ గ్రామానికిచెందిన ఏజెంట్ కస్పా శ్యామ్ దుబాయిలో ఉద్యోగాల పేరిట తమ నుంచి లక్షలా ది రూపాయలు వసూలు చేశారని ఇటీవల బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురానికి చెందిన నర్సింహమూర్తి ఉన్నారు. ఇటీవల తాను అయిలాపూర్ కు వెళ్లగా శ్యామ్ తోపాటు మధు, సాయిరెడ్డి, గుడ్ల ప్రకాశ్ దాడి చేశారని నర్సింహమూర్తి నందిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.