Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2025, 9:50 pm Posted by : ramakrishna

జిజిహెచ్ లో దారుణం

  • నవ జాత శిశువుపై పడిన సీలింగ్ పెచ్చులు

 

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రి( ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ)లో దారుణం జరిగింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆసుపత్రి లో సీలింగ్ పెచ్చులు ఉడి నాలుగు రోజుల క్రితం పుట్టిన నవజాత శిశువుపై పడ్డాయి. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనలో బాలిక ముఖానికి గాయాలైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Atrocities in GGH

జిజిహెచ్ మొదటి అంతస్తులోనే రూమ్ నంబర్ 178 లో బెడ్ నంబర్ 11 పై ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే బాలిక తల్లిదండ్రులు మహమ్మద్ అఫ్సర్, ఫాతిమా బేగం  స్పందించి బాలికను ఇతర వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం బాధ్యత రహితoగా పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా, జిల్లా ఆసుపత్రిలో సేవల విషయంలో నిర్లక్ష్యం మారడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.