Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2024, 12:43 pm Posted by : ramakrishna

ఏటీఎంలో చోరీకి యత్నం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని సీతారాంనగర్ కాలనీలో ఉన్న ఏటీఎంలో మహేందర్ అనే యువకుడు చోరీకి యత్నించాడు. ఆదివారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో ఏటీఎంలోకి వెళ్లిన మహేందర్ చోరీకి యత్నిస్తుండగా గమనించిన స్థానికులు వెంటనే ఐదో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహేందర్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.