ఏటీఎంలో నగదు ఉపసంహరణపై మే నుంచి పెరగనున్న ఛార్జీలు

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ ఛార్జీలు మే 1 నుంచి పెరగనున్నాయి. ఇంటర్ ఛేంజ్ ఫీజు పెంచుకునేందుకు ఆర్బీఐ అనుమతించిన నేపథ్యంలో ఈరుసుములు పెరగనున్నట్లు డీడీ న్యూస్ వెల్లడించింది. ఏటీఎం  లావాదేవీలు నిర్ణీత పరిమితి మించితే, ప్రతి లావాదేవికి ఖాతాదారులు ఈఅదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీల భారాన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు బదిలీ చేస్తాయే లేదా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది