అర్ధరాత్రి మొరం దందా..
తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత బతుకమ్మ: బిచ్కుంద : అక్రమ వెంచర్లకు అక్రమంగా మొరం తరలింపు మండలంలో యదేచ్ఛగా కొనసాగుతుంది. మండల కేంద్రంలోని శివారు భూములలో ఈ వ్యవహారం అనునిత్యం కొనసాగుతూనే ఉంది. మైనింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. సొంత పట్టగలిగిన భూముల నుండి కూడా మట్టి తవ్వకాలు చేపట్టాలంటే వాటికి సంబంధించిన అధికారుల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వాటిని బేఖాతరు చేస్తూ... అలవాటు పడిన కొంతమంది అక్రమ వ్యాపారస్తులు యదేచ్చగా మొరం నూతన వెంచర్లకు...