Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 December 2024, 7:22 pm Posted by : ramakrishna

అర్ధరాత్రి మొరం దందా..

  • తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత

బతుకమ్మ: బిచ్కుంద : అక్రమ వెంచర్లకు అక్రమంగా మొరం తరలింపు మండలంలో యదేచ్ఛగా కొనసాగుతుంది. మండల కేంద్రంలోని శివారు భూములలో ఈ వ్యవహారం అనునిత్యం కొనసాగుతూనే ఉంది. మైనింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. సొంత పట్టగలిగిన భూముల నుండి కూడా మట్టి తవ్వకాలు చేపట్టాలంటే వాటికి సంబంధించిన అధికారుల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వాటిని బేఖాతరు చేస్తూ… అలవాటు పడిన కొంతమంది అక్రమ వ్యాపారస్తులు యదేచ్చగా మొరం నూతన వెంచర్లకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

At midnight...

పైకి ఆరా.. లోన పహారాలో దందా..

మండలంలో జరుగుతున్న మట్టి దందా పై మైనింగ్, రెవెన్యూ విభాగాల అధికారులు ఆరా తీస్తున్నట్టుగా పైకి చెబుతున్నా, లోలోన మాత్రం వీరి అనుమతులతోనే యదేచ్ఛగా ఈ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. లేకపోతే అడ్డు అదుపు లేకుండా, విచ్చలవిడిగా టన్నుల కొద్ది మొరం టిప్పర్లను ఎలా తరలిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు లోతుగా దృష్టి సారించకపోవడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి అక్రమ మొరం దందాపై సంబంధిత విభాగాల అధికారులు అందరూ దృష్టి సారించి కట్టడి చేయాలని, లేకపోతే చెరువులు గుట్టలు లూటీ అవుతాయని పలువురు అంటున్నారు. అంతేకాదు అక్రమ మొరం తరలింపును అడ్డుకొని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.

తహశీల్దార్ సురేష్ వివరణ

మొరం తరలింపు పై బిచ్కుంద తాసిల్దార్ సురేష్ ను వివరణ కోరగా, ఎవరు అనుమతి తీసుకోలేదని, రెవెన్యూ సిబ్బందిని పంపి వాటిపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎంతటి వారైనా ఉపేక్షించబోమని వారుతెలిపారు.

At midnight...