Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2024, 3:57 pm Posted by : ramakrishna

లొంక ఆలయంలో ఒక్కటైనా ప్రేమజంట

సిరికొండ, బతుకమ్మ : గత నాలుగు నెలలుగాఒకరినొకరు ప్రేమించుకొంటున్న ప్రేమజంట బుధవారం సిరికొండ మండలంలోని లొంక రామేశ్వర స్వామి ఆలయం ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే మండలంలోని తాళ్ళరామడుగు కు చెందిన పిట్ల నరేష్ (25),నిర్మల్ జిల్లా మామిడాల మండలం దిమ్మతుర్తి కి చెందిన శ్రీలత(20) లు ప్రేమించుకొంటున్నారు. వారి ప్రేమ విషయం వారివారి తల్లిదండ్రులకు వివరించి వివాహం చేయమని కోరాగా ఇద్దరి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దాంతో మేజర్లైనా ఇరువురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకొని ఒక్కటయ్యారు.వివాహ అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ తల్లిదండ్రుల నుండి రక్షణ కల్పించాలని కోరారు.