వెబ్ న్యూస్, బతుకమ్మ : యాక్సి యం-4 మిషన్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో రెండు వారాల పాటు ప్రయోగాలు చేసిన ఆ మిషన్ సభ్యులు సోమవారం భూమికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఐఎస్ఎస్ లో ప్రస్తుతం 11 మంది ఉన్నారు. వారిలో ఏడుగురు ఎక్స్పిడిషన్-73 ద్వారా వెళ్లిన వారు కాగా, శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు యాక్సియం-4 ద్వారా వెళ్లారు. తిరుగు ప్రయాణంపై నాసా కమర్షియల్ క్రూ ప్రొగ్రాం మేనేజర్ స్టీవ్ స్టిచ్ ఆమెరికాలో మీడియాతో మాట్లాడారు. సోమవారం ఉదయం 7.05 గంటలకు ఐఎస్ఎస్‌లోని హార్మోనీ మాడ్యూల్ ద్వారా ఆ నలుగురు బయటకు వచ్చి స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ను అధిరోహిస్తారని తెలిపారు. కాలిఫోర్నియా సముద్ర తీరంలో దిగుతారని చెప్పారు. భారత కాలమానం ప్రకారమయితే మంగళవారం సాయంత్రం 3.00 గంటలకు భూమి మీదకు వస్తారు.