ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ట్రైనీ ఐఏఎస్, అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని ప్రధానోపాధ్యాయుడు వెంకట్‌రామ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, వాటికి...