రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో ఏముల సాయిలు తండ్రి పెద్ద గంగారాం కొన్ని రోజుల క్రితం ప్రమాదావశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇబ్బంది పడుతుండడంతో ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వారిని ఇటీవల కలిసి వారికీ దైర్యం చెప్పి తన వంతు ఆర్ధిక సహాయం చేసి తన ట్రస్ట్ ద్వారా ప్రతి నేల మెడిసిన్స్ ఇపిస్తాను అని వారి కుటుంబానికి భరోసానిచ్చాడు. గురువారం కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెడిసిన్స్ కోసం 6 వేల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు కోనేరు తరుణ్ సాయితేజ అందించడం జరిగింది. అదేవిదంగా రుద్రూర్ గ్రామానికి చెందిన ధర్మారం వెంకటేష్, తండ్రి రాములు టీబీ వ్యాధితో బాధపడుతున్నారు. తనకి కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తమ వంతు ఆర్ధిక అందిచమని కోరగా వేంకటేష్ కు కోనేరు ట్రస్ట్ ద్వారా 5 వేల రూపాయల చెక్కును వారికి అందజేశారు. రుద్రూర్ గ్రామంలో రెండు కుటుంబాలకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చెక్కులను అందించారు. ఆలాగే ప్రతి నేల మెడిసిన్స్ కు ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తానని వారికీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ పటేల్, ఆలపాటి హరికృష్ణ, ఏముల గజేందర్, ప్రశాంత్ గౌడ్, కుమ్మరి గణేష్, వినోద్ కుమార్, బేగటి శివప్రసాద్, సాయికుమార్, బోజిగొండ అనిల్, కుర్లెపు గంగాధర్, రేపల్లి సాయి ప్రసాద్, కోరుట్ల సాయి తదితరులు పాల్గొన్నారు.