గంజాయి అక్రమ వ్యాపారంతో సంపాదించిన ఆస్తులు సీజ్
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ విజయనగరం, బతుకమ్మ : విజయనగరం జిల్లా రామభద్రపురం పోలీసు స్టేషను పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టు కాబడిన గంజాయి వ్యాపారి శెట్టి ఉమా మహేశ్వరరావు అలియాన్ హుస్సేన్ అలియాన్ పుతిన్కు చెందిన రూ.1,89,84,768/-ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేస్తున్నట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. విశాఖపట్నంలో నివాసం ఉంటున్న శెట్టి ఉమా మహేశ్వరరావు అలియాస్ హుస్సేన్ అలియాస్ పుతిన్ అనే వ్యక్తి కొంతమంది వ్యక్తుల సహకారంతో 147కిలోల గంజాయిని తరలిస్తుండగా...