Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2024, 5:52 pm Posted by : ramakrishna

మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి

ఆర్మూర్, బతుకమ్మ : మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కో-చైర్మన్ అంగరి ప్రదీప్ నాయకత్వంలో గురువారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలకు నిరసనగా,  ఒకే కులానికి కొమ్ముకాస్తూ  మాల కులం పై ఇష్టానుసారంగా  మాట్లాడుతూ మాలలపై తన ద్వేషాన్ని వెల్లగకుతున్నారన్నారు. మాలల మద్దతుతో అధికార గద్దె నెక్కి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మాలలను విస్మరిస్తూ మాలలపై దుష్ప్రచారాన్ని చేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగిందని తెలిపారు.  రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి అన్ని సబ్బాండ వర్గాలకు న్యాయం చేయాల్సిన రేవంత్ రెడ్డి ఒక మాదిగ కులానికి మాత్రమే సపోర్ట్ గా మాట్లాడాటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి తన దోరణిలో మార్పు రాకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి రాజకీయ జీవితాన్నీ బొంద పెట్టడానికి మాలలు సిద్ధమవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ మందాల భాస్కర్, మాదాసు రాహుల్, ఎన్పీ వీరస్వామి, ప్రణయ్, దాసరి విశాల్, చిక్కుడు గుండాలు, మన్నె శ్రీధర్ , బలవంతరావు తదితరులు పాల్గొన్నారు.