ఎద్దుల  బండిపై అసెంబ్లీకి ఎమ్మెల్యేలు

హైదరాబాద్, బతుకమ్మ: రుణ మాఫీ వర్తించని రైతులకు వెంటనే వర్తింపజేయాలని, రైతు భరోసా, రైతు బీమా అమలు చేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యేలు ఎద్దుల బండిపై అసెంబ్లీకి వచ్చారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణగుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్ల కార్డులను ప్రదర్శిస్తూ ఎద్దుల బండిపై అసెంబ్లీకి చేరుకుని నిరసన తెలిపారు.