సేవా గుణాన్ని చాటుకున్న అస్పత్ వార్ అరుణ్ – శ్వేత దంపతులు

  జుక్కల్, బతుకమ్మ :   పిల్లల పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు పోకుండా, సమాజానికి ఉపయోగపడేలా జరుపుకొని పలువురికి ఆదర్శంగా నిలిచారు పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన అస్పత్ వార్ అరుణ్, శ్వేత దంపతులు. తమ కుమార్తె అద్వైత పుట్టినరోజును పురస్కరించుకొని మంగళవారం పెద్ద ఎడ్గి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో వారు ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని చిన్నారి పిల్లల సౌకర్యార్థం అస్పత్ వార్ అరుణ్ - శ్వేత దంపతులు తమ స్వంత ఖర్చులతో కుర్చీలను కొనుగోలు చేసి, అంగన్‌వాడీ కేంద్రం...