రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ భార్య దుర్మరణం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ భీంరావు భార్య మాక్లూర్ భవాని(58) బుధవారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బాసరకు వెళ్లారు.అమ్మవారి దర్శనం అనంతరం తిరిగొస్తూ ప్రమాదానికి గురయ్యారు. కంఠేశ్వర్ బైపాస్ మీద వస్తుండగా వీరి వాహనానికి ఒక కుక్క అడ్డుగా వచ్చింది. దీంతో భవాని కుమారుడు సడెన్గా బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో వాహనంలో కొంగు చిక్కుకోవడంతో భవాని అదుపు తప్పి...