Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2025, 6:00 pm Posted by : ramakrishna

ఘనంగా అశోక విజయదశమి వేడుకలు

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామంలో అశోక విజయదశమి గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అశోకుడు మొదటి ఏడు రోజుల ఏడు ప్రజా సంక్షేమ పథకాల ప్రకటన అష్టమి రోజు బౌద్ధ ఉపవాసం, నవమి రోజు ప్రజలకు భూమి పంపిణీ చేశాడు. అశోకుడు కళింగ యుద్ధంలో విజయం సాధించిన రోజు “విజయదశమి” ఆరోజు నా ప్రతి ఏడది అశోకుడు ధర్మ విజయదశమిగా ఉత్సవాలుగా నిర్వహించేవాడు. ఆ తర్వాత ప్రజలు దీన్ని అశోక విజయదశమిగా జరుపుకుంటున్నారు. 1956లో బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అశోక విజయదశమి నాడే ఆరు లక్షల మందితో నాగపూర్ లో బౌద్ధం స్వీకరించాడు. అశోక విజయదశమి లేదా ధర్మ చక్ర పరివర్తన దివస్ గా భావిస్తారు. ఈ విధంగా పండగను సుల్తాన్ పేట్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మరిభ, రామచందర్, ఈరయ్య, అశోక్ కుమార్, లక్ష్మణ్, భూమయ్య, శంకర్, రాములు, రాజు, రాజేందర్, బస్వంత్, నివర్తి, మనోహర్, భారత్, సునీల్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Ashoka Vijayadashami celebrations in full swing