గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణం

వెబ్ న్యూస్, బతుకమ్మ : గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణం చేశారు.  రాజ్ భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.  బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం ఉదయం 11:30 గంటలకు అశోక్ గజపతిరాజుచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్, మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణి, పలువురు టీడీపీ ఎంపీలు హాజరయ్యారు.