నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా నూతన విద్యాశాఖాధికారి(డీఈఓ)గా అశోక్ నియమితులయ్యారు. నూతనంగా డీఈఓగా నియమితులైన అశోక్ ఇది వరకు ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిగా విధులు నిర్వహించారు. గతంలో నిజామాబాద్ డైట్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశారు. ఇది వరకు డీఈఓగా పనిచేసిన దుర్గా ప్రసాద్ ను మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్ గా నియమించారు.