ఆశాల వేతనాలు వెంటనే చెల్లించాలి

  కోటగిరి, బతుకమ్మ :   పోతంగల్ మండలంలోని పీహెచ్ సీ పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం కొంతమందికి వేతనాలు చెల్లించి, మరికొంతమందికి చెల్లించకపోవడం సరికాదని వేతనాలు రాని ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు పోతంగల్ పీహెచ్ సీ లో అధికారి కరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు నన్నేసాబ్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో కొంతమంది ఆశా కార్యకర్తలకు వేతనాలు చెల్లించి, మరి కొంతమందికి...