కోటగిరి, బతుకమ్మ :
పోతంగల్ మండలంలోని పీహెచ్ సీ పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం కొంతమందికి వేతనాలు చెల్లించి, మరికొంతమందికి చెల్లించకపోవడం సరికాదని వేతనాలు రాని ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు పోతంగల్ పీహెచ్ సీ లో అధికారి కరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు నన్నేసాబ్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో కొంతమంది ఆశా కార్యకర్తలకు వేతనాలు చెల్లించి, మరి కొంతమందికి చెల్లించకపోవడం ఏంటని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. వెంటనే వేతనాలు చెల్లించకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలతో కలిసి పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పద్మ, అనిత, నాగమణి, శారద, శాంత తదితరులు పాల్గొన్నారు.