Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 December 2024, 8:27 pm Posted by : ramakrishna

ఆశా వర్కర్ల బస్ జాత జయప్రదం చేయండి

 రుద్రూర్, బతుకమ్మ : ఫిబ్రవరిలో జరిగే శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో ఆశా కార్యకర్తలకు 18 వేలు ఫిక్స్డ్  వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల బస్ జాత చేపట్టామని ఈనెల 19న నిజామాబాద్ జిల్లా కేంద్రానికి జాత చేరుకుంటుందని ఆశా కార్యకర్తలు తెలిపారు. బస్ జాతకు సంబంధించిన వాల్ పోస్టర్లను బుధవారం రుద్రూర్ పీహెచ్ సీలో ఆవిష్కరించారు. సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సభ నిర్వహిస్తున్నామని ఆశా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాణి, భూలక్ష్మి, రంజన, లక్ష్మి, గంగామణి, ప్రవళిక, శోభ, పుష్ప, నాగమణి, ప్రేమల, సునీత తదితరులు పాల్గొన్నారు.