Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 7:09 pm Posted by : ramakrishna

మదన్ మోహన్ ఉన్నంత వరకు పేదోడి కలలు నిజమవుతాయి

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

మదన్ మోహన్ ఉన్నంత వరకు పేదోడి కలలు నిజాలవుతాయని ఎల్లారెడ్డి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంతోష్ నాయక్ అన్నారు. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జానకంపల్లి కుర్దు గ్రామంలో ఒక పేద కుటుంబానికి చెందిన సాయిబాబా రోజా దంపతుల సొంతింటి కల సాకారం కావడం నిజంగా ఆనందకరమైన విషయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రకాష్, సర్పంచ్ నాయక మంజుల సాయిలు, ఉపసర్పంచ్ సాయిరాం, వార్డ్ మెంబర్లు, ఏపీవో వినోద్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, జీపీవో సాయిరాం, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

 

As long as Madan Mohan exists, the dreams of the poor will come true.