కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్లో సోమవారం ముత్యపు రాఘవుల ఫంక్షన్ హాల్ లో ఆర్యవైశ్య సంఘం మహాసభ జిల్లా అధ్యక్షుని గా కంచర్ల బాలకృష్ణ ప్రమాణస్వీకారం చేశారు. కంచర్ల బాలకృష్ణ చేత రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సునీత ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించ దగ్గ పరిణామమని అన్నారు. అనంతరం జిల్లా కార్యవర్గ సభ్యుల చేత ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస శ్రీనివాస్, జిల్లా రైస్ మిల్లర్ సంఘం అధ్యక్షుడు కంచర్ల లింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యపు సుదర్శన్, మాజీ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పాత బాలక్రిష్ణ, వంగపల్లి నాగభూషణం, నార్ల రత్నకుమార్లతో పటు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.