Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 December 2024, 4:15 pm Posted by : ramakrishna

ఆర్యవైశ్య మహాసభ నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గానికి సన్మానం

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పోల విట్టల్ రావుని, నూతన ప్రధాన కార్యదర్శి చిదుర ప్రదీప్, నూతన కోశాధికారి నీల భాస్కర్ ని,గౌరవ అధ్యక్షులు బచ్చు అంజయ్యలను శుక్రవారం హైదరాబాదులో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా అభినందించి సన్మానించారు. అనంతరం నియామకాపత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా మాట్లాడుతూ… నూతనంగా ఎన్నికైన నిజామాబాదు జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయమని అన్నారు. ఈ మేరకు నూతన కార్యవర్గం ఆర్యవైష్యుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాసభ ఉపాధ్యక్షుడు ఆగిరి వెంకటేష్, కార్యవర్గ సభ్యులు పోల సుధాకర్, జిల్లా ప్రస్తుత అధ్యక్షులు మోటూరి మురళి, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Arya Vaishya Mahasabha Nizamabad district honors the new committee