అర్వింద్ సెటైర్లు.. రాకేశ్ నిప్పులు

నిజామాబాద్, బతుకమ్మ: దిశ సమావేశంలోన, బయట.. ఎంపీ అర్వింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. దిశ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే టార్గెట్ గా అర్వింద్ సెటైర్లతో విరుచుకుపడగా, సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇన్ చార్జి మంత్రి పేషీని పెట్రోల్ పోసి తగులబెడతానని నిప్పులుకక్కారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. జిల్లాకు మంత్రి దిక్కు లేడని, ఇన్ చార్జి మంత్రి ఆరు నెలలకోసారి వస్తాడన్నారు. జిల్లా డెవలప్ మెంట్ పై ద్రుష్టి...