నిజామాబాద్, బతుకమ్మ: దిశ సమావేశంలోన, బయట.. ఎంపీ అర్వింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. దిశ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే టార్గెట్ గా అర్వింద్ సెటైర్లతో విరుచుకుపడగా, సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇన్ చార్జి మంత్రి పేషీని పెట్రోల్ పోసి తగులబెడతానని నిప్పులుకక్కారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. జిల్లాకు మంత్రి దిక్కు లేడని, ఇన్ చార్జి మంత్రి ఆరు నెలలకోసారి వస్తాడన్నారు. జిల్లా డెవలప్ మెంట్ పై ద్రుష్టి పెట్టాల్సిన సీనియర్ సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి కోసం అలిగి కూర్చున్నాడన్నారు. పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం ను తాను కోరుతున్నానన్నారు.
మంత్రి పేషీని తగులబెడుతా..
దిశ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అధికారులపై విరుచుకుపడ్డారు. ప్రోటోకాల్ పాటించడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ చార్జి మంత్రి పనులను పట్టించుకోకపోవడంతో ప్రగతి కుంటుపడిందన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు సిగ్గుపడుతున్నా.. సెక్రటేరియట్ లో జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి పేషీని పెట్రోల్ పోసి తగులబెడతానని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
