హైదరాబాద్,బతుకమ్మ : ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ ముగిసింది. ఇవాళ దాదాపు 6 గంటల పాటు అరవింద్ కుమార్ ను అధికారులు ప్రశ్నించి స్టేట్‌మెంట్ ను రికార్డు చేశారు. ఆర్థిక అనుమతులు, ఎన్నికల నిబంధనలు పాటించకుండా నిధుల మళ్లింపుపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ని ప్రశ్నించారు.