అరుణోదయ జిల్లా అడహక్ కమిటీ ఎన్నిక
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: అరుణోదయ జిల్లా అడహక్ కమిటీ ని ఆదివారం ఎన్నుకున్నారు.నిజామాబాద్ నగరంలోని ఎన్.ఆర్.భవన్ లో అరుణోదయ నిజామాబాద్ జిల్లా ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ సమావేశానికి హాజరై మాట్లాడుతూ... కలలు మనిషిని ఆలోచింపజేస్తాయనీ, ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా నూతన పాటలను రాసి పాడే విధంగా కళాకారులు కృషి చేయాలన్నారు. వివిధ రాజకీయ పార్టీలు అనేక హామీలను ఇస్తూ ప్రజలను మోసగిస్తున్నారనీ దానిని పసిగట్టి కళాకారులు...