Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 May 2025, 4:23 pm Posted by : ramakrishna

అరుణోదయ జిల్లా అడహక్ కమిటీ ఎన్నిక

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: 

అరుణోదయ జిల్లా అడహక్ కమిటీ ని  ఆదివారం ఎన్నుకున్నారు.నిజామాబాద్ నగరంలోని ఎన్.ఆర్.భవన్  లో అరుణోదయ నిజామాబాద్ జిల్లా ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ జిల్లా కార్యదర్శి  వనమాల కృష్ణ సమావేశానికి హాజరై మాట్లాడుతూ… కలలు మనిషిని ఆలోచింపజేస్తాయనీ, ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా నూతన పాటలను రాసి పాడే  విధంగా కళాకారులు కృషి చేయాలన్నారు. వివిధ రాజకీయ పార్టీలు అనేక హామీలను ఇస్తూ ప్రజలను మోసగిస్తున్నారనీ దానిని పసిగట్టి కళాకారులు కల రూపంలో అనేక పాటలు రాసి ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. అరుణోదయ కళాకారులు జిల్లా అభివృద్ధి కృషి చేయాలన్నారు. తాత్కాలికంగా అరుణోదయ కళాకారుల  అడహక్  కమిటీ ని ఎన్నుకున్నారు.  ఈ కమిటీ కి కే.గంగాధర్ కన్వీనర్ గా, కమిటీ సభ్యులుగా బి. మురళి, రమేష్,చరణ్, రాజన్న, కచ్చే గంగాధర్ ఉంటారన్నారు. ఈ సమావేశంలో పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గోదావరి, సంధ్య, గంగాధర్, సీతారాం కుమార్, రాజన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు.