Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 1:20 pm Posted by : ramakrishna

ఎక్సైజ్  అసిస్టెంట్ కమిషనర్ గా అరుణ్ కుమార్ బాధ్యతల స్వీకరణ

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్  అసిస్టెంట్  కమిషనర్  డి అరుణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం నిజామాబాద్  ఏసీ కార్యాలయంలో ఆయనకు  సిఐల, ఎస్ హెచ్ ఓలు, ఎస్ ఐ లు స్వాగతం పలికారు. నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన సోమిరెడ్డి ఇటివల డిసిగా పదోన్నతితో బదిలీ అయిన విషయం తెలిసిందే. దానితో ఈఎస్ గా పనిచేస్తున్న అరుణ్ కుమార్ కు ఎసి గా పదోన్నతి నిజామాబాద్  బదిలీ చేయగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. టీఎన్జీవోస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరమ్ కేంద్ర ఉప అధ్యక్షుడు  కె. అరుణ్ కుమార్ డి.పి.ఇ.ఓ కార్యాలయం ఏఈఓ ( ఎఎఓ) వి. నరసయ్య నూతన అసిస్టెంట్ కమిషనర్ డి. అరుణ్ కుమార్ కి పూలగుచ్ఛములు అందజేసి ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎసి అరుణ్ కుమార్ ఎక్సైజ్ శాఖలో విధుల నిర్వహణ, పరిపాలనా పరమైన అంశాలపై చర్చించారు. శాఖా పరమైన లక్ష్యాలను విజయవంతంగా చేరుకోవడంలో బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో సిబ్బంది అంతా ఎలాంటి రాజీ లేకుండా, నూతన అధికారికి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఫోరమ్ మాజీ కార్యదర్శి ఎం. శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్లు ఎం. దేవేందర్, శేఖర్ రాజ్, రిజ్వాన్, సభ్యులు రాజు, నాగరాజు, రాణా, సబా, సాయిబాబా, సృజన తదితరులు పాల్గొన్నారు.