తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యాదిలో కళాకారుల పాట ఆట

   నిజామాబాద్ సిటి, బతుకమ్మ: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కవులు, కళాకారుల పాత్ర పై సాంస్కృతిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అదివారవ పెన్షనర్స్ భవన్ నిజామాబాదులో కమిటీ సభ్యులు రాధా కిషన్ అధ్యక్షతన సభను నిర్వహించారు. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డు కొమరయ్యను, అమరవీరులను స్మరిస్తూ సాంస్కృతిక సభను ప్రారంభించారు. సభలో గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ లెఫ్టినెంట్ డాక్టర్ మేకల రామస్వామి  ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కవులు, కళాకారులు చేసిన కృషితోనే ప్రజా...