Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 February 2025, 12:52 pm Posted by : ramakrishna

భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే: సీఎం రేవంత్ రెడ్డి

మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం

హైదరాబాద్ జర్నీలో మరో మైలురాయి

హైదరాబాద్, బతుకమ్మ :   భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ను ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. హైదరాబాద్ జర్నీలో ఇది మరో మైలురాయిగా నిలవనుందన్నారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు.  మైక్రోసాఫ్ట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెడుతున్నామన్నారు. హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ తో ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు.  ఆయన వెంట ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, మైక్రోసాఫ్ట్ అధికారులు ఉన్నారు.