ఇందిరా మహిళా శక్తి సంబురాలపై కళాజాత ప్రదర్శనలు

నిజామాబాద్, బతుకమ్మ : వర్ని మండలం కోటయ్య క్యాంపు, కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామాలలో గురువారం ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమాలపై కళాజాత బృందాలు ప్రదర్శనలు నిర్వహించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహిళా సాధికారత సంబురాలలో భాగంగా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు, డీఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.పద్మశ్రీల నేతృత్వంలో సంస్కృతిక సారథి కళా బృందాలు మహిళా సాధికారత కార్యక్రమాల గురించి తమ ప్రదర్శనల ద్వారా తెలియజేశారు. వడ్డీ లేని రుణాలు, మహిళా సాధికారత, ఉచిత బస్సు...