Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 6:12 pm Posted by : ramakrishna

బోధన్‌లో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం

బోధన్ బతుకమ్మ :

 

బోధన్ పట్టణంలో రోడ్డు భద్రత, బాధ్యతాయుత డ్రైవింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు “అరైవ్ అలైవ్ (Arrive Alive)” కార్యక్రమాన్ని శుక్రవారం సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సబ్ కలెక్టర్ మున్సిపల్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని, బాధ్యతాయుత డ్రైవింగ్‌ ద్వారా మాత్రమే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత కీలకమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యతతోనే పౌరుల భద్రత, సంక్షేమం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహ, ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకట్ నారాయణ, తహసీల్దార్ విటల్ పాల్గొన్నారు.