బోధన్‌లో ‘అరైవ్–అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు
బోధన్ బతుకమ్మ : రోడ్డు ప్రమాదాల నివారణకు డీజీపీ సూచనల మేరకు బోధన్ పట్టణంలో అరైవ్–అలైవ్ (Arrive Alive) అవగాహనా కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపల్ కార్యాలయం, ఆర్టీఏ కార్యాలయం, ఆర్టీసీ డిపోల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు సోఫీ, ప్రవీణ్ గుజార్‌తో పాటు ఇతర వైద్యులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, కార్యాలయాల సమీపంలో పాదచారుల భద్రత, ప్రమాదం జరిగిన...