కామారెడ్డి బస్టాండ్ ఆవరణలో అరైవ్ – అలైవ్ కార్యక్రమం
కామారెడ్డి, బతుకమ్మ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర అన్నారు. సోమవారం రోజున వారి ఆదేశాలతో కామారెడ్డి బస్టాండ్ ఆవరణలో పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని, కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపవద్దని అన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, సురక్షత ప్రయాణం చేసి గమ్యం చేరాలని,...