Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 5:38 pm Posted by : ramakrishna

అరైవ్ అలైవ్ అనేది ఒక నినాదం కాదు ఉద్యమంలా సాగాలి

. . . ఈనెల 13 నుండి 24 వరకు ఈ అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమాలు

 

. . . జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

అరైవ్ అలైవ్ అనేది ఒక నినాదంలా కాకుండా అందరిలో రోడ్డు ప్రమాదాలు నివారించే ఒక ఉద్యమంలా ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ అన్నారు. దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ అవగాహన కార్యక్రమాలు కామారెడ్డి జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఘనంగా ప్రారంభమయ్యాయన్నారు. ఈ నెల 13 నుండి 24 వరకు జరిగే ఈ కార్యక్రమాలలో మొదటి రోజు దేవునిపల్లి పోలిస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామంలో నిర్వహించిన సదస్సులో జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మన కామారెడ్డి జిల్లాలో ఉగ్రవాయి గ్రామంలోనే ఈ మహత్తర కార్యక్రమం ప్రారంభించడానికి ముఖ్య కారణం మన గ్రామస్థులు గత 11 నెలల్లో ఒక్క రోడ్డు ప్రమాద మరణం అనేది జరగకుండా జాగ్రత్తలు తీసుకుని స్పూర్తి దాతలుగా నిలిచారని అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్క వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలనే వారి కుటుంబ సభ్యుల ఆశను తీర్చే కార్యక్రమం కావాలన్నారు. రోడ్డు ప్రమాదాలు యాద్రచ్చికాలు కావని అవి మన నిర్లక్ష్యం, అతివేగం, అజాగ్రత్త వల్లనే జరుగుతాయన్నారు. హెల్మెట్ ధరించడం కేవలం చలానాల నుండి చట్టం నుండి తప్పించుకోవడానికి కాకుండా మీ ప్రాణాన్ని కాపాడే ఆయుధంగా వాడాలనన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపడం వలన రోడ్డు ప్రమాద మరణాలు జరిగి ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయని, ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బాధ్యతను గుర్తుంచుకోవాలని, మొబైల్ వాడకం, ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని ఎస్పీ సూచించారు. ఈ అవగాహన కార్యక్రమాలు కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్ల పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సభలలో ప్రతీ ఒక పోలీసు అధికారి పాల్గొని నిర్వహించాలని, ఇలాగే ఈ నెల 24 వరకు కొనసాగుతాయని అన్నారు. ప్రమాదాల నివారణలో పోలీసులకు సహకరించాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, బాధ్యతగా వాహనాలు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పీ బి.చైతన్య రెడ్డి, కామారెడ్డి రూరల్ ఇన్ స్పెక్టర్ రామన్, దేవునిపల్లి ఎస్సై రంజిత్ గౌడ్ , ఉగ్రవాయి సర్పంచ్ మహేష్, ఉపసర్పంచ్ తో పాటు యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

Arrive Alive is not a slogan, it should be a movement.
Arrive Alive is not a slogan, it should be a movement.