Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 4:52 pm Posted by : ramakrishna

తహసీల్దార్ కార్యాలయంలో అరైవ్ అలైవ్ అవగాహన

. . . మద్యం సేవించి వాహనాలు నడపరాదు

 

. . . ఎస్సై జి.సందీప్

 

ఇందల్వాయి, బతుకమ్మ:

 

ఇందల్వాయి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సై జి.సందీప్ ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సై సందీప్ మాట్లాడుతూ యువకులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయని సూచించారు. ప్రమాదాల మీద అవగాహన కల్పించడమే అరైవ్ అలైవ్ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఈ అరైవ్ అలైవ్ అనే ఒక నినాదంలా కాకుండా అందరిలో రోడ్డు ప్రమాదాలు నివారించే ఒక ఉద్యమంలా ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఒక వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలనే వారి కుటుంబ సభ్యుల ఆశను తీర్చే కార్యక్రమం కావాలన్నారు. రహదారి భద్రత నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ఉన్నదని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు మన నిర్లక్ష్యం, అతివేగం, అజాగ్రత్త వల్ల జరుగుతాయని, హెల్మెట్ ధరించడం అనేది కేవలం చలాన్లు చట్టం నుండి తప్పించుకోవడానికి కాదు అది మీ ప్రాణాన్ని కాపాడే ఆయుధం అని ప్రతీ ఒక్క వాహనదారుడు గ్రహిచాలి. ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వెంకటరావు,సందీప్ ఎస్సై జి సందీప్, సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.