జనవరి 2న జిల్లాకు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ రాక
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీం అక్తర్ గురువారం (జనవరి 2న) నిజామాబాద్ జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ంధీ హనుమంతు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కుల సంఘాల సభ్యులు వర్గీకరణ విషయంపై దరఖాస్తులను కలెక్టరేట్లో సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ఫారాలు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ లలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.