నేడు పీసీసీ చీఫ్ రాక
నిజామాబాద్, బతుకమ్మ: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేడు జిల్లా కేంద్రానికి రానున్నారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రానికి మహేశ్ కుమార్ గౌడ్ చేరుకుంటారని, సోమవారం ఉదయం 11గంటల నుంచి నగరంలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.