19న నరేంద్రాచారి మహరాజ్ రాక
జుక్కల్, బతుకమ్మ: జగద్గురు నరేంద్రాచార్యజీ మహరాజ్ సంస్థానము (తెలంగాణ ఉపపీఠము)అనంత విభూషిత జగద్గురు నరేంద్రాచార్యజీ మహరాజ్ జుక్కల్ లోని తెలంగాణ ఉపపీఠానికి ఈనెల 19న రానున్నారని పీఠం సభ్యులు తెలిపారు. 19, 20 తేదీల్లో మహరాజ్ దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణతోపాటు మహారాష్ర్ట, కర్ణాటక రాష్ర్టాల నుంచి తరలిరానున్న భక్తులకు స్వామిజీ ఉపాసక్ దీక్ష, సాధక్ దీక్ష ఇవ్వనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.