22న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రాక

ఎంసీహెచ్, క్రిటికల్ కేర్ యూనిట్ లను ప్రారంభించనున్న మంత్రి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిజామాబాద్, బతుకమ్మ :  ఈనెల 22న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా రూ.38.78కోట్లతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ (ఎంసీహెచ్), క్రిటికల్ కేర్ యూనిట్ లతో కూడిన భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎంసీహెచ్ భవన సముదాయాన్ని శుక్రవారం సందర్శించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీ+4 అంతస్థులతో కూడిన...